Sunday, December 12, 2010

Prema Poojari---Nithyam Mugdha Sevalo- 1


ప్రభుత్వ సంస్థ కావడం తో 11 అయిన ఆఫీస్ అంత కాలిగానే ఉంది...ఒక్క వెంకటేశం తప్ప ఆఫీస్ లో ఇంకా రాలేదు ఎవరు...వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు వెంకటేశం...అతను చూడడమే తప్ప లోపలకి ఎవరు వొస్తున్నట్టు సూచనలు కూడా కనిపించకపోవడం తో...చూసి చూసి చిరాకు వచ్చిన వెంకటేశం ఏం చెయ్యాలో తోచక ఏదో ఒక పనిని ప్రారంభించాలని అనుకున్నాడు...

ఎదురుగా ఉన్న ఫైళ్ళ కట్ట లో ఒక ఫైల్ తీశాడు...పేజ్ లు అయితే తిప్పాడు కానీ....అందులో ఉన్నది ఏమిటో కూడా అర్దం చేసుకోవడానికి అతని బుర్ర సహకరించటం లేదు ...మరి అతను మనసు ఆఫీస్ గుమ్మం చుట్టూ తిరుగుతూ ఉంటే అతను బుర్ర లో కి ఫైల్ లో ఉన్నది ఎలా ఎక్కుతుంది ....
ఇంకా వెంకటేశానికి తన తక్షణ కర్తవ్యం అర్దం అయింది...తాను ఇప్పుడు పని ఎలాగూ చెయ్యలేదు అని ....ఎదురుగా ఉన్న టీ కొట్టు కి వెళ్లాడు టీ తాగడానికి....మామలుగా అయితే అక్కడ పని చేసే గుమస్తా శంకరం తీసుకుని వచ్చి ఇవ్వాలి...కానీ శంకరానికి కూడా ఇంకా ఆఫీస్ కి టైమ్ కాకపోవడం తో....వెంకటేశమే అక్కడకి బయలు దేరి వెళ్లాడు.....
టీ కొట్టు మల్లేషం వెంకటేశానికి స్టైల్ గా ఇంగ్లీష్ లో " గుడ్ మార్నింగ్ సర్!!!" అని అన్నాడు....
మల్లేషం కొట్టు కి టీ, టిఫిన్ కోసం చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ లు వస్తూ ఉంటారు కనుక ...వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుని తను ప్రయోగిస్తుంటాడు మల్లేషం....
వెంకటేశం మనసు ఎక్కడో ఉండడం తో ...మల్లేషం గ్రీటింగ్ కి ముక్త సరి గా నవ్వి...ఒక టీ చెప్పాడు....
సమయం ఏదో ఒకలా గడపడానికి టీ తాగాను అనిపించాడు వెంకటేశం.....
క్షణం ఒక యుగం గడుస్తుంది అతనకి ..........
11:15 అవ్వడం తో అప్పుడు తెల్లారినట్టు ఒకలు ఒకల్ళే వొస్తున్నారు ఉద్యోగులంతా కార్యాలయానికి....
ఇంతలో పింక్ కలర్ స్కూటీ పైన వచ్చి ఆఫీస్ ముందు ఆగింది ముగ్ధ....
క్షణం ఆఫీస్ ముంది ఆగిన ముగ్ధ బండి తో పాటు...ఒక్క క్షణం వెంకటేశం గుండె కూడా ఆగింది...
ఇంత సేపు తన నిరీక్షణ ఫలించడం తో విసుగు ఒక్కసారిగా ఎగిరిపోయింది....
ఆమెను చూస్తూ తన్మయత్వమ్ లో ఉన్న వెంకటేశం ఆమె అలా ఆఫీస్ లోనికి వెళ్ళిపోయి కనుమరుగు అవ్వగానే...ఒక్కసారి ఉలిక్కి పడి...ఒలిమ్‌పిక్స్ లో గోల్డ్ మెడల్ కోసం పరుగు పెట్టె అథ్లెట్ లా పరుగు పెట్టి...ఒక్క ఉదుటున ఆఫీస్ లోనికి ప్రవేశించబోయాడు....
అతను పరుగెత్తిన వేగానికి ఎదురుగా వెళ్ళి అప్పుడే వచ్చి లోపలికి వెళ్ళబోతున్న క్లర్క్ కాంతమ్మ గారిని డీకొన్నాడు ...కాంతమ్మ గారు దానితో కెవ్వు మని పెద్ద కేక పెట్టారు...
కాంతమ్మ గారి కేక ఫలితమో....లేక వెంకటేశం వచ్చి డీకొన్న వేగమో....ఎగిరి వెళ్ళి వెనకాలనే ఉన్న సోఫా లో పడ్డాడు ......
ఆమె కేక తో ఫైయర్ అలార్మ్ వచ్చినట్టు అలెర్ట్ అయిన ఆఫీస్ ఉద్యోగులు అంతా ఉలిక్కి పడి లేచి నిలబడి చూసి...అక్కడ ఎగిరి పడుతున్న వేంకటెసాన్ని చూసి ఒక్క క్షణం అవాక్కయ్యారు....
ఇంతలో సోఫా లో పడి ఉన్న వేంకటెసాన్ని లేపడానికి వచ్చిన గుమస్తా శంకరం ...." ఎందుకు సర్!!! ప్రొద్దున్నె సర్కస్ ఫీట్ లు చేస్తున్నారు" అని జోక్ వేశాడు పాక పాక నవ్వుతూ....
వాడు తన మీద జోక్ వేశాడు అని వాడు అంతలా నవ్వెవరకు గ్రహించని వెంకటేశం...." కాంతమ్మ గారితో ఫీట్లా!!!!!" అన్నట్టు విసురుగా శంకరం వైపు ఒక చూపు విసిరి....ముగ్ధ కూర్చున్న సీట్ వైపు వేగం గా తన దృష్టి మరల్చాడు....
అక్కడ తన మీద వెయ్యబడిన జోక్ కొ లేక ఇన్దాకల శంకరం అన్నట్టు తన చేసిన సర్కస్ ఫీట్ కొ!!! తెలియదు కానీ ....ఆమె మనోహరంగా నవ్వుతూ కనిపించింది వెంకటేశానికి....
మనసులోనే పాటని అందుకున్నాడు వెంకటేశం...."గాల్లో తేలీనాట్టుందే..గుండె పేలీనాట్టుందే....తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే" ...
బాగానే ఉన్నారా సర్...ఏమన్నా అయిందా....తల మీద ఏమన్నా దెబ్బ కానీ తగిలిందా ఏంటి...అలా పెట్టారు ఫేస్ అన్న శంకరం మాటలతో...తన పాటకు బ్రేక్ వేసి...శంకరం వైపు అదొలా చూస్తూ లేచి తన సీట్ దెగ్గరకి వెళ్ళిపోయాడు వెంకటేశం..
ముగ్ధ ఆఫీస్ లో ముందు రోజే చేరింది.. ఆమెని చూసి ...తొలి చూపు లోనే ప్రేమించి....ఆమె రూపాణికి ముగ్ధుడు అయిన వెంకటేశం....అలా తనని చూసిన దగ్గర నుంచి ఆమె ఊహల లోనే ఉన్నాడు....
ఆమె ఎప్పుడు ఆఫీస్ కి వొస్తుందో..ఎక్కడ నుంచి వొస్తుందో..ఎప్పుడు బ్రేక్ లు తీసుకుంటుందో తెలుసుకోవాలి అనుకున్నాడు...
దేవత దర్శనం తో సంతృప్తి పొందిన భక్తుడి లా థన్మయత్వమ్ లో ఉన్నాడు వెంకటేశం...
మదిలో ముగ్ధ రూపాన్ని పదే పదే తలుచుకుంటూ...కట్ట లో ఉన్న ఫైల్స్ ని చూడడం ఒక్కక్కటి గా పూర్తి చేస్తున్నాడు....
ఇంతలో పక్క సెక్షన్ లో కూర్చునే పాపారావ్ వచ్చి పిలిచాడు వెంకటెసాన్ని : "ఏమండోయ్ వెంకటేశం గారు!! లంచ్ కి వెళ్దామా??" అని
టైమ్ కూడా ఒంటి గంట అవుతుండడం తో...నా దేవత ఆలోచనల్లో సమయమే తెలియటం లేదు ...పని చేసినట్టే అనిపించటం లేదు అని అనుకున్న వెంకటేశం ....పాపారావ్ తో కలిసి క్యాంటీన్ కి బయలు దేరాడు...
ముగ్ధ కూడా అక్కడే భోజనం చేస్తూ కనిపించడం తో... పాపారావ్ ...ఇలా అప్పుడప్పుడు మంచి పనులు చేసి...తన పాపాలని కడుగుకుంటాడు కాబోలు అని తనలోనే తాను నవ్వుకున్నాడు...
భోజనానికి అయితే వచ్చాడు కానీ...తినకుండానే వెంకటేశానికి కడుపు నిండి పోయింది ఆమె ని చూడగానే....
అంతలోనే అతడి ఆనందాన్ని ఆవిరి చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది ముగ్ధ..
దేవుడా నా బాధలు ఎన్నాళ్ళు ...ఎప్పటికీ నా ప్రేమను వ్యక్త పరిచే ధైర్యాన్ని ఇస్తావు అని దేవుడిని మనసులోనే వెడుకున్నాడు వెంకటేశం....
అలా రోజు గడిచి ఇంటికి వెళ్ళిన వెంకటేశం రాత్రి కూడా ముగ్ధ ఊహలతో, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ అలాగే నిద్ర పోయాడు..
ఉదయాన్నే లేచి ...ఆఫీస్ కి రెడీ అయ్యి ఎప్పటి లాగానే పదే పదే అద్దం లో తన హైర్ ని చెక్ చేసుకుంటూ ఆఫీస్ కి బయలుదేరాడు...
అతని ముందు రోజు చేసిన ప్రార్ధన ఫలితమో..లేక యాదృఛ్ఛికమో...ముగ్ధ మార్గ మధ్యం లోనే తారస పడింది వెంకటేశానికి
బైక్ ని తన ముందు ఆపి " హెలో ముగ్ధ గారు! గుడ్ మార్నింగ్" అంటూ పలకరించాడు
దానికి ఆమె అతని వైపు ఎవరు అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూడడంతో...తన హెల్మెట్ పెట్టుకుని ఉండడం గమనించి వెంటనే అది తీసి చేతితో పట్టుకున్నాడు...
అప్పుడు అతనిని గుర్తు పట్టిన ముగ్ధ 'ముగ్ధ మనోహరంగా' నవ్వుతూ "హెలో అండీ! వెరీ గుడ్ మార్నింగ్" అంది...
తనకి ఇలా ముగ్ధ తో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి మనసులోనే వెయ్యి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు వెంకటేశం..
"ఏంటండి మీరు ఇక్కడ వైట్ చేస్తున్నారు" అన్న అతని ప్రశ్నకి ..."ఆఫీస్ కే నండి" అంది నవ్వుతూ..
"మరి మీ స్కూటీ ఏమైంది!!! మీరు ఇక్కడ నుంచి వస్తారా??" అని అడిగేసి...మరల అన్ని ప్రశ్నలు అడిగాడు కదా ఆమె ఏమన్నా సందేహిస్తుందేమో అని అనుకున్నాడు..
అతడి భావాలేమీ గమనించని ఆమె "నా స్కూటీ సర్విస్ కి ఇచ్చానాండి..మా ఇల్లు ఇక్కడకి దగ్గరలోనే..ఇక్కడకి ఆటోస్ వొస్తాయని ఇక్కడ నిలబడి వైట్ చేస్తున్నాను" అని అంది..
అడగాల వొద్దా అని మనసులో అనుకుంటూనే అడిగాడు వెంకటేశం " నేను ఆఫీస్ కి వెళ్తున్నాను...మీకు అబ్యాంతరం లేకపోతే ....నాతో పాటు రావొచ్చు" అని అన్నాడు..
ఆమె ఒక నిమిషం పాటు ఆలోచించి "సరేనండి" అని అంది...
దాంతో ఒక్క ఉదుటున బైక్ స్టార్ట్ చేసి .."ప్లీస్" అని బ్యాక్ సీట్ చూపించాడు
ఆమె చిరు దరహాసం తో ఎక్కి కూర్చుంది....
తెరలు తెరలు గా వొస్తున్న గాలికి ఆమె వేసుకున్న గ్రీన్ కలర్ చున్ని అతనిని థాకుథు ఉండడం తో పులకరిన్చి పోయాడు వెంకటేశం..
అతను బైక్ మీద ఉన్నా..అతని మనసు మాత్రం మేఘాల్లో తేలుతూ ఉంది....
అంతలోనే ఆఫీస్ రావడం తో...అతని బైక్ కి..ఇంకా అతని ఆనందానికి కూడా బ్రేక్ పడింది...
ఆమె దిగి వెళ్తూ " చాలా థాంక్స్ అండీ" అని చెప్పి అలా ఆఫీస్ లోపలకి నడుచుకుంటూ వెళ్ళింది..
ఆమె నడుస్తున్న వన దేవత వలె కనిపిస్తూ ఉండడం తో అలా రెప్ప వెయ్యడం మరిచి చూస్తూ ఉండిపోయాడు..