Friday, December 10, 2010

కలల వీరేశం

మనిషి ఆశ జీవీ(అత్యాశ జీవీ????)...తనకి ఉన్న దాని కంటే ఎక్కువ ఆశించడం అతని స్వభావం.... అన్నం కోసం ఆరాట పడే వారు కొందరు...ఆస్తి కోసం ఆశ పడే వారు కొందరు...అధికారం కోసం అత్యాశ పడే వారు మరి కొందరు...ఇలా ప్రయాణం లో పలు రకాల మనుషులు...విబిన్నమైన ఆలోచనలు...
ఒక ఆటలో ఒక దేశానికి ప్రాతి నిద్యం వహించి గెలిపిస్తే ఆయనని దేవుడు అంటారు...మరి దేశ ప్రజలకు తినడానికి తిండీని సమకూర్చే రైతు ని మాత్రం ఎందుకు దేవుడు అని అనరు!!! ఒక రాజకీయ నాయకుడు పొందే గౌరవం ..మరి తనకి హోదా ని సమకూర్చిన సామాన్యుదికి తిరిగి ఇవ్వడేందుకు!!!!!
వ్యత్యాసాలు ఎందుకు పుడుతున్నాయి..ఎన్నో అర్దం చేసుకొని, మరెన్నో తయారు చెయ్యగల్గిన మేధావి అయిన మనిషి తనకు తాను సంతృప్తిని ..సంతోషాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు....
ఇలాంటి సమాజం లో ఒక మనిషి గురించి రాసిందే కథ " కలల వీరేశం"... కథ కొంత మందిని అయిన నవ్విస్తుందని...సంతోషాన్ని ఇస్తుందని ఆశిస్తూ...
" కలల వీరేశం "
చిన్నప్పటి నుంచి ఏదో సాదించాలనే తపనతో ఉండే వాడు వీరేశం...ఎప్పుడు ఎం సాదించాలి అనుకునే వాడో వాటిని గురించి కలలు కంటూ ఉండే వాడు...
కొన్నాళ్ళు కలెక్టర్ అవ్వాలి అని...తర్వాత డాక్టర్ అవ్వాలి అని...మరి కొన్నాళ్ళకి లాయర్ అవ్వాలి అని...క్రికెట్ చూస్తున్నపుడు సచిన్ టెండుల్కర్ అవ్వాలి అని...సినిమా చూస్తున్నపుడు చిరంజీవి లాంటి నటుడు అవ్వాలి అని ...ఇవేవీ కాకపోతే వీరేశ లింగం పంతులు గారంత సంగసంస్కర్త కాకపోయినా ....అంతటి పేరు తెచ్చుకోవాలి అని...ఇలా రోజు రాత్రి నిద్రపోయి కలలు కానే వాడికి మల్లే...పగలుకో కల కానే వాడు వీరేశం తన గమ్యం గురించి.....

పదో తరగతి తర్వాత ప్లస్ 2 కూడా కంప్లీట్ చేశాడు.. సారి కలల్లో...స్టేట్ ర్యాంక్ లు వొచ్చినట్టు...తనని ఇంటర్‌వ్యూ చేయడానికి మీడీయ వాళ్ళు పోటీ పడుతున్నట్టు...పిలాని లాంటి సంస్థలు తమ దాంట్లో నే వొచ్చి చేరమని బ్రతిమాలుతున్నట్టు...ఇలా కలలు కనడం పూర్తయ్యింది...అటు వీరేశం ప్లస్ టూ కూడా పూర్తయ్యింది...కానీ కలలు కనడం లో సగం సమయాన్ని వ్రుదా చేసిన వీరేషానికి ....స్టేట్ ర్యాంక్ లు అయితే రాలేదు కానీ....సాదించాలనే తపన ఉండడం తో మాత్రం మంచి మార్కులే వొచ్చాయి....కానీ పాపం మన వీరేశానికి వచ్చిన మార్క్ లు మంచివే ఆయినా ..ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ కళాశాలల్లో చదివే సగం మంది విద్యార్డులకు ఇంత మంచి మార్క్‌లు రావడం సహజం కావడం తో .....మన వీరేశాన్ని మీడీయ వాళ్ళు వచ్చి ఇంటర్‌వ్యూ చెయ్యలేదు...ఇంకా ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చి తమ దాంట్లో చేరమని బ్రతిమాల లేదు.....
ఇంకా వీరేశం తనకి దెగ్గర్లో ఉన్న ఒక ఇంజినియరింగ్ కాలేజ్ లో చేరాడు...ఇక అటు పైన మన వీరేశం కలల లెవెలే పెరిగి పోయింది.....
తాను ఒక సైంటిస్ట్ ని అయిపోయినట్టు కలల్లో తేలుతూ ఉండేవాడు....తాను కనిపెట్టిన పరికరం ప్రపంచ ప్రఖ్యాతి పొందినట్టు....అలాంటి పరికరం ఇంతకు ముందు కానీ ఇంకా పైన కానీ ఎవరు కనిపెట్టలేదు అన్నట్టు....అలా వీరేశం కలల ప్రహసనం సాగుతూ ఉండేది.....
ఇలా వీరేశం కలలో పరిషోదనలు చేస్తూనే ...ఇంజినియరింగ్ పూర్తి చేశాడు....కానీ ఇంజినియరింగ్ పూర్తి చేసిన వీరేషానికి ఏం కనిపెట్టాలో....ఎలా కనిపెట్టాలో కూడా అర్దం కాలేదు....
ఇలా అయోమయం లో ఉన్న వీరేషానికి సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ గా ఉద్యోగం వచ్చింది ఒక పెద్ద సంస్థ లో....
ఉద్యోగం లో జాయ్న్ అయిన వీరేశం.....మొదట్లో వాళ్ళు చెప్పే పనులతో తాను ఏం కలలు కనాలో ...దేని గురించి కలలు కనాలో కూడా తెలియక....కొన్ని రోజులు తన కలలు ధారవాహికకు విరామాన్ని ప్రకటించాడు....
ట్రైనింగ్ లు కంప్లీట్ చేసిన వీరేషాన్ని ప్రాజెక్ట్ లో కి పంపించారు.....
ఇంకా ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఫేస్ లో ఉండడం తో వీరేషానికి అవకాశం వచ్చేసింది తన పనిని తాను మొదలు పెట్టడానికి...
ఇంకా కలలు కనడం మొదలు పెట్టేశాడు.....తాను ప్రాజెక్ట్ మొతాన్ని ఒక్క చేత్తో నడిపించగల సత్తా చూపించినట్టు....తనకు ఎవరికి రాని అంత త్వరగా ప్రమోషన్ లు వచ్చినట్టు....ఇంకా మ్యానేజర్ అయిపోయినట్టు.....
అలా వీరేశం ప్రమోషన్ లు కలల్లో నే కానీ ....నిజం లో జరగలేదు.....
వీరేశానికి వయసు పెరుగుతూ ఉండడం తో....ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు....
ఇంకా వీరేశానికి సమయం రావడం తో పగటి కలల ట్రెండ్ మారిపోయింది....
సారి అతని కలలలోకి ఇలియాన లాంటి అమ్మాయిలు వస్తుందే వారు....వారు వీరేసాన్ని చూసి అతన్నే పెళ్లి చేసుకుంటాను అని మంకు పట్టు పట్టినట్టు...బోలెడంత కట్నం .....కార్, బంగ్లా లు వంటి కానుకలతో గణంగా పెళ్లి జరిగినట్టు....
కానీ పాపం ఎప్పుడు పగటి కాలాల్లో తేలుతూ....ప్రపంచం లో తక్కువగా ఉండే వీరేశానికి వయసుతో పాటు...పొట్ట కూడా పెరిగింది...
వయసు, పొట్ట ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ వీరేశానికి ఐశ్వర్య రాయ్ కాదు కదా....కనీసం కల్పన రాయ్ దొరకడం కూడా కష్టం అయింది...
ఇంకేం...ఇంట్లో వాళ్ళు వీరేశం వీరోచితంగా ప్రయత్నించగా...చివరికి వీరేశానికి పెళ్లి జరిగింది....
పెళ్లి , తర్వాత పిల్లలు పుట్టిన వీరేశానికి కలలు కనడానికి సమయం లేక ....కొంచెం సమయం ఉన్న అది ఉన్న సమస్యలని పరిష్కరించడానికి చాలక తన కలల ప్రహస్నానికి చరమ గీతం పాడాడు.

No comments:

Post a Comment